సంగీతము-ప్రకృతి తత్వము-శరీర ధర్మము
1 min read
సంగీతము-ప్రకృతి తత్వము-శరీర ధర్మము
సంగీతము-ప్రకృతి తత్వము-శరీర ధర్మము
ప్రకృతిలోని ప్రతి జీవియొక్క శరీర ధర్మము ఇంచుమించు ఒక్కటే అయినప్పటికీ, తనను తాను తెలుసుకునే ప్రయత్నపూర్వకమైన మేధశక్తి కలిగియున్నందువలన మానవ జీవితము కొంచెం భిన్నమైనదిగా తెలియుచున్నది.
పంచేంద్రియములైన “శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు” అనే అనుభూతిని పొదుతున్నటువంటి జీవాత్మకు, “శబ్దము” అను అనుభూతి మిక్కిలి ముఖ్యమైనది.
ప్రకృతిలో జనియించిన శ్రావ్య శబ్దమైన “ఓం”కార మనెడి పరమాత్మతో అనుసంధానమైన జీవాత్మ, ఆ అనుభూతిని తల్లి గర్భము నుండీ ఎరిగిన వాడే.
తల్లి గర్భము నుండి ఈ ప్రపంచములోకి వచ్చిన తరువాత ప్రయత్న పూర్వకముగా ఆ ఎరుకని కలిగి వుండటమే ఙ్ఞానము అనెడి మానవ శరీర ధర్మము.
శ్రావ్యమైన ధ్వని విశేషణమునకు మారుపేరే “నాదము” నాద సంబంధమైనదే “సంగీతము”
మన భారతీయ సంగీతము “శ్రావ్యమైన” అను విధానమునకు కట్టుబడి ఏర్పరచినటువంటిది.
శబ్ద శ్రావ్యతను ఎంత అనుభూతి పొందితే అంత ఆనందం మన సొంతం.
పున్నమరాజు శైలజ కృష్ణ
writer