Vodafone Idea ఒక్కటై VI గా మారడానికి కారణాలు ఇవేనట
1 min read
Vodafone Idea ఒక్కటై VI గా మారడానికి కారణాలు ఇవేనట
Vodafone Idea ఒక్కటై VI గా మారడానికి కారణాలు ఇవేనట
2016 లో జియో మార్కెట్లోకి వచ్చాక వేరే సంస్థలపై దాని ప్రభావం తీవ్రంగా పడింది. దాన్ని తట్టుకోటానికి ఐడియా వొడాఫోన్ 2017 లో ఒక్కటవ్వాలనుకున్నాయి. కానీ అది 2018 డిసెంబర్ 1 నాటికి నెరవేరి రెండూ ఒకటయ్యాయి. అవి ఒకటైనప్పటికీ జియో అందిస్తున్న ప్యాకేజీలు ప్లాన్స్ కి ఇవి నిలబడలేకపోయాయి. సరే అని అలాంటి ప్యాకేజీలు ప్లాన్స్ అంత తక్కువ ధరకు వీళ్ళూ అందిచే పరిస్తితుల్లో లేక అప్పటి నుంచి వాటి షేర్లు పతనమవుతూ వస్తున్నాయి.
ఇక 2020 మార్చి 31 వరకు వొడాఫోన్ ఐడియా రెండింటిలో కలిపి దాదాపు 319.19 మిలియన్ వినియోగదారులు ఉన్నారు. అంతే కాదు ఇది ఇండియాలోనే 3వ పెద్ద మొబైల్ కమ్యూనికేషన్ నెట్వర్కుగా, ప్రపంచంలో 5వ పెద్ద మొబైల్ కమ్యూనికేషన్ నెట్వర్కుగా ఉంది.
అయితే ఇందాక చెప్పుకున్నట్టు ఎప్పుడైతే జియో వచ్చిందో అప్పటి నుంచి ఎయిర్ టెల్ వొడాఫోన్ ఐడియాలు ఆ కాంపిటీషన్ కి తట్టుకోలేక గవర్నమెంటు ప్రవేశపెట్టిన AGR ని కూడ కట్టలేని పరిస్థితుల్లోకి వచ్చేసాయి. కానీ ఎయిర్టెల్ మాత్రం గవర్నమెంటు ప్రవేశపెట్టిన AGR ని కట్టుకుని మార్కెట్లో నిలదొక్కుకుంది.
రాను రాను వొడాఫోన్ ఐడియ పరిస్థితి ఎలా తయారైందంటే అప్పటిదాకా వొడాఫోన్ ఐడియ సిం కార్డులు వాడుతున్న చాలా మంది జియో కు కన్వర్ట్ ఐపోయారు. దాంతో వొడాఫోన్ ఐడియాలు AGR ని కట్టుకోలేని పరిస్థితుల్లోకెళ్ళిపోయాయి.
వొడాఫోన్ ఐడియాలు 58 వేల కోట్ల AGR ను కట్టాల్సి ఉంటే దాంట్లో కేవలం 8 వేళ కోట్లు మాత్రమే కట్టి మిగతా 50 వేల కోట్లు మేము కట్టలేం అనీ మేము కంపనీ మూసుకుంటాము అనీ గవర్నమెంటుకు చెప్పుకునాయి. వారి పరిస్థితిని అర్థం చేసుకున్న ఇండియా గవర్నమెంటు అలాగే ట్రాయ్ కలిసి వాటికొక అవకాశం ఇచ్చాయి అదేంటంటే మీరు కంపనీని మూసుకోవాల్సిన అవసరం లేదు. మీకొక 10 సంవత్సరాలు సమయం ఇస్తాం. ఆ 10 సంవత్సరాలలో సంవత్సరానికి 5 వేల కోట్లు కట్టుకోండి అనీ వాటికి చెప్పాయి.
దాంతో ఇక వొడాఫోన్ ఐడియాలు కొత్తగా ఆలోచించి ఏం చేసాయంటే వొడాఫోన్ ఐడియా ఈ రెండు కంపనీలను ఎత్తేసి వొడాఫోన్ లోని మొదటి అక్షరం V ఐడియాలోని మొదటి అక్షరం I ఈ రెండిటినీ కలిపి VI అనే అదే కంపనీని రీబ్రాండ్ చేసి రీలాంచ్ చేసింది. అంటే ఇప్పుడు వొడాఫోన్ ఐడియా కంపనీలు కలిసి VI అనే కొత్త కంపనీగా మారిపోయాయన్నమాట.
దీనివళ్ళ వొడాఫోన్ ఐడియా కంపనీలకు ఉపయోగమేంటంటే వారికి కొత్త కొత్త ఇన్వెస్టర్లు వస్తారు కమప్నీలో ఇన్వెస్టు చేయటానికి దాంతో వారు గవర్నమెంటుకు కట్టుకోవాల్సిన AGR ని కూడా కట్టుకోగలుగుతారు.
దీనివళ్ళ వినియోగదారులకు ఉపయోగం ఏంటంటే మిమ్మల్ని ఆకర్శించేందుకు కొత్త కొత్త ప్లాన్సు తీసుకొస్తారు. ఎందుకంటే మీరొక షాపుకి సిమ్ము తీసుకుందాం అని వెళ్ళి ఒక ఐడియానో వొడాఫోన్ సిమ్మో అడిగితే షాప్ అతను అవి రావట్లేదు VI తీసుకోండి అని అంటాడు, సో వొడాఫోన్ ఐడియాలే VI గా మారిపోయాయన్న సంగతి సిమ్ము తీసుకునే వారికి తెలియదు కాబట్టి దాన్ని తీసుకోవడానికి ఇష్టపడకపోవచ్చు కాబట్టి అవగాహన కోసం అయినా సరే మీకోసం కొత్త కొత్త ప్లాన్సు ని ఖచ్చితంగా తీసుకొస్తారు. ఇంకొక హైలైట్ ఏంటంటే సిమ్ము సిగ్నల్ స్ట్రెంతు, సిగ్నల్ స్ట్రెంతు అయితే చాలా బాగుంటుంది. ఎందుకంటే అంతకుముందు ఐడియాకు, వొడాఫోన్లకు వేరువేరుగా టవర్స్ ఉండేవి కానీ ఇప్పుడు ఆ రెండు ఒకటవ్వటం వల్ల మీకు ఎక్కడ చూసినా VI టవర్సే కనపడతాయి. ఇంకొక విషయం ఏంటంటే ఇంటర్నెట్టూ, VI కంపనీ ఈ సంవత్సరం చివరికళ్ళ 5జీ నెట్వర్కుని తీసుకొస్తాం అని గట్టిగానే చెప్తుంది. కాబట్టి మొత్తానికి ఎవరైతే ఐడియా వొడాఫోన్ సిమ్ములు వాడుతున్నారో వారు భయపడాల్సిన అవసరం లేదు. మీరు వొడాఫోన్ సిమ్ము వాడుతున్నా ఐడియా సిమ్ము వాడుతున్నా అవి ఆటోమేటిక్ గా VI సిమ్ములుగా మారిపొతాయి కాబట్టి మీరు ఏమాత్రం దిగులుపడాల్సిన అవసరమైతే లేదు.
అలాగే రిచార్జ్ ప్లాన్సు గురించి ఇంకా ఈ కంపనీ ఎలాంటి ప్లాన్సు రిలీజ్ చేయలేదు. బహుశా త్వరలోనే ఈ రీచార్జ్ ప్లాన్సుని కూడా రిలీజ్ చేయవచ్చు.
ముందుముందు మార్కెట్లో జియో, ఎయిర్టెల్ మరియు VI లకు గట్టి పోటీ ఉండబోతుంది అని మాత్రం అర్థమవుతుంది.
For More Updates Please Do Subscribe To Prathap Facts Youtube Channel: https://www.youtube.com/channel/UCvsv_CgBf9HiOysmtFXlDGA