సెప్టెంబరు 1 నుంచే తెలంగాణలో పాఠశాలలు కళాశాలల ప్రారంభం
1 min read
సెప్టెంబరు 1 నుంచి తెలంగాణలో అన్నీ పాఠశాలు, కళాశాలలు ప్రారభం అవుతాయని అయితే తరగతులు మాత్రం ఆన్లైన్ ద్వారానే నిర్వహించబోతున్నట్టు అందుకోసం ఉపాధ్యాయులకు, అధ్యాపకులకు తగిన శిక్షణ కూడా పూర్తయిందని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రా రెడ్డి తెలిపారు.
ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఈ నెల 27 నుంచే సంబధిత పాఠశాలలకు, కళాశాలలకు వెళ్ళాలని ఆదేశాలు జారీ చేశారు. సెప్టెంబర్ 5న రాధాకృష్ణ జయంతి సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయుల సన్మానం కూడా ఉంటుందని మంత్రి తెలిపారు.