నేచురల్ లిప్ బాం..అరటిపండుతో మొటిమలు పులిపిర్లకు చెక్?
1 min read
నేచురల్ లిప్ బాం..అరటిపండుతో మొటిమలు పులిపిర్లకు చెక్
కాలంతో, ప్రాంతంతో పనిలేకుండ ఏ సమయంలోనైన దొరికేది ఒక్క అరటిపండు మాత్రమే. రోడ్డు పక్కన తోపుడుబండి నుంచి సూపర్ మార్కెట్ల వరకు ఎక్కడైన దొరుకుతుంది. ఖరీదు కూడా అందరు కొనుక్కోగలిగేలానే ఉంటుంది.అరటిపండు లో పొటాషియం, విటమిన్ B6, విటమి C ఉంటాయి కాబట్టి అరటిపండు ఆకలిని తీర్చి శక్తిని ఇవ్వటంతోపాటు ఆరోగ్యంగా ఉండటానికి కూడా ఉపయోగపడుతుంది.
అరటిపండు తిని తొక్కపడేయటం మనందరికి అలవాటు కానీ అదే మనం చేస్తున్న పొరపాటు. ఆ అరటిపండు తొక్కతో కూడ ఎన్నో లాభాలున్నాయి మనకు అవేంటంటే.,
నేచురల్ లిప్ బాం
సాధారణంగా చాలా మందికి ఊరికూరికనే పెదాలు పగిలి చూడటానికి అసహ్యంగా కనిపిస్తుంటాయి, అలాగే కొంతమందికి చలి కాలం రాగానే ఇలాంటి ప్రాబ్లం మొదలవుతుంది. దాని కోసం మార్కెట్లో దొరికే ఎవేవో లిప్ బాంస్ వాడుతుంటారు కానీ మనకు తెలియని విషయం ఏంటంటే అరటిపండు తొక్క నేచురల్ లిప్ బాం అనీ, అవునూ అరటిపండు తొక్కతో పెదాలకు రాస్తూ మర్దనలాగ చేస్తే మీ పెదాలు ఎప్పటిలాగే మామూలుగా మారిపోవటంతో పాటు తళతళలాడుతుంటాయి.
మొటిమలు పులిపిర్లు
అదే అరటిపండు తొక్కతో మొహమ్మీద మర్దన లాగా చేసుకుని కాసేపటివరకు ఆ మొటిమలు లేదా పులిపిర్లమీద ఆ తొక్కలను వుంచి ఆ తర్వాత మొహాన్నీ నీటితో కడుక్కుంటే ఇలా చేసిన కొద్దిరోజుల్లోనే మీ మొటిమలు పులిపిర్లు పోయి మీ మొహం అందంగా కనిపిస్తుంది.
నోట్: ఇంకా అనుమానాలుంటే ఋజువులకోసం యూట్యూబ్ లేదా గూగుల్ లో వెతికి ఎలా ఉపయోగించాలో తెలుసుకోగలరు.