మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇకలేరు
1 min read
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇకలేరు
మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కొద్దిరోజుల క్రితం అనారోగ్యం తో ఢిల్లీ ఆర్మీ ఆసుపత్రిలో హాస్పిటల్ లో చేరారు. దాంతోపాటు కోవిడ్ కూడా సోకటం తో ప్రణబ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆ తరువాత ఆయన కోమాలోకి వెళ్ళారు. ఆయన వయసురీత్యా మరియు వివిధ ఆర్గాన్స్ ఫెయిల్ అవ్వటంతో డాక్టర్ల ప్రయత్నాలేవి ఫలించకపోవటంతో ఈ సాయత్రం ఆయన తుది శ్వాస విడిచారు.
ప్రణబ్ ముఖర్జీ డిసెంబరు 11, 1935న పశ్చిమ బెంగాల్ లోని బిర్భుమ్ జిల్లా మిరాఠీ గ్రామంలో బెంగాలీ కులీన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని తండ్రి కమద కింకర ముఖర్జీ భారత స్వాతంత్ర్యోద్యమంలో క్రియాశీల సభ్యుడు. అతని తండ్రి 1952 నుండి 1964 వరకు పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లో భారత జాతీయ కాంగ్రెస్ తరపున సభ్యునిగా, ఎ. ఐ. సి. సి సభ్యునిగా ఉన్నాడు. అతని తల్లి రాజ్యలక్ష్మీ ముఖర్జీ
ప్రణబ్ ముఖర్జీ 1982 లో ఇందిరా గాంధీ ప్రభుత్వంలో భారత ఆర్థిక మంత్రిగా మొదటిసారి పనిచేశాడు. అతను 1982-83 లో మొదటి వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టాడు.
ఆయన అలంకరించిన ఎన్నో పదవులకు ఆయన వన్నె తెచ్చారు.
చివరిగా, 25 జూలై 2012 – 25 జూలై 2017 మధ్య కాలంలో భారతదేశ రాష్ట్రపతిగా పదవులు నిర్వహించారు.