ఎన్ని”కల”ల రోజు..!!
1 min read
జనాల కలలు నిజమయ్యే రోజు ఇదీ కాదు కాదు.
కొందరి నాయకుల కలలు నిజమయ్యే రోజు, మరికొందరి నాయకుల కలలు కల్లలయ్యే రోజు.
అంతే కానీ జనాల కలలు చిగురించే రోజు ఏమాత్రం కాదు.
కలల్ని కలర్ నోట్లకు అమ్మేసి అభివృద్ధిని మద్యానికి తాకట్టుపెట్టి స్వతంత్ర భారతావని ఇంకా ఎప్పుడు ఎదుగుతుందని నిందించే మర్యాదస్తుల రోజు.
జెండా పెట్టినవాడికి జిందాబాదుల రోజు.
జెండా మోసేవాడికి ఇంటికెళ్తే బియ్యానికి డబ్బులు లేవని తడుముకునే మహానుభావుల రోజు.
ఆరకట్ల రవితేజ