ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో సొరంగాన్ని గుర్తించిన BSF
1 min read
ఇండియా పాకిస్తాన్ సరిహద్దులో సొరంగాన్ని గుర్తించిన BSF
మరోసారి పాకిస్తాన్ వక్రబుద్ధి బట్టబయలైంది. జమ్మూకశ్మీర్లోని సాంబా జిల్లాలో ఉన్న భారత్-పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దులో పెట్రోలింగ్ సమయంలో సరిహద్దు భద్రతా దళం (బిఎస్ఎఫ్) ఒక సొరంగం కనుగొంది. అది సుమారు సరిహద్దు కంచె నుండి 50 మీటర్ల దూరంలో ఉన్నట్టు ఆ సొరంగాన్ని పరిశీలించగా అందులో సుమారు 8-10 ప్లాస్టిక్ ఇసుక సంచులున్నట్టు వాటిపై “కరాచీ & షకర్గర్” అని వ్రాసి ఉండగ వాటి తయారి గడువు వివరాలను బట్టి అవి ఇటీవలే తయారు చేయబడినవి మరియు అవి పాకిస్థాన్ కి సంబంధించినవిగా గుర్తించినట్టు అధికారులు తెలిపారు.
ప్రస్తుతం నిఘావర్గాల సమాచారంతో జమ్మూ, పంజాబ్, రాజస్థాన్ మరియు గుజరాత్ అంతర్జాతీయ సరిహద్దుల వెంట 3,300 కిలోమీటర్లు బిఎస్ఎఫ్ భారీగా భద్రతా దళాలను మోహరిచింది., ఎందుకంటే ఉగ్రవాదులు ఐబిని ఉల్లంఘించి భారతదేశంలోకి చొరబడే ప్రమాదముంది.
ఆయుధాలు మరియు మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు సొరంగాలు ఉపయోగిస్తున్నారనే అనుమానంతో వాటిని కనిపెట్టేందుకు భూమిలోకి చొచ్చుకుపోయే రాడార్లను ఉపయోగించాలనుకుంటున్నట్టు సమాచారం.