Sat. Feb 27th, 2021

అర్థరాత్రి కింద కూర్చుని స్క్రిప్ట్ రాసుకున్న పవన్ కళ్యాణ్

1 min read

అర్థరాత్రి కింద కూర్చుని స్క్రిప్ట్ రాసుకున్న పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఆయనతో ఉన్న అనుభవాల గురించి ఒక్కొక్కరు ఒక్కోలా పంచుకుంటూంటే బొమ్మరిళ్ళు సినిమా మాటల రచయిత అబ్బూరి రవి గారు చెప్పిన అనుభవాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.

ఒకరోజు అర్థరాత్రి వాళ్ళు స్క్రిప్ట్ రాసుకుంటూంటే మధ్యలో రవి గారికి నడుము నొప్పి వచ్చి అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి చెప్తే ఆయన ఏం మాట్లాడకుండ లోపలికి వెళ్ళిపోయారంట అది చూసి కళ్యాణ్ గారికి కోపం వచ్చినట్టుంది అని రవి గారు భయపడిపోయారట కానీ తీరా చూస్తే పవన్ కళ్యాణ్ గారు ఒక చాప దిండు తీసుకొచ్చిచ్చి మీరు పడుకోండి అని చెప్పి ఆయన పక్కన కింద కూర్చుని పెన్ను ప్యాడు పట్టుకుని మీరు చెప్పండి నేను రాస్తాను అన్నారని పవన్ కళ్యాణ్ గారి గొప్పతానాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు.

అన్నవరం సినిమా టైములో పవన్ కళ్యాణ్ గారికిచ్చిన 1983 చందమామ కథల బౌండ్ మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత పంజా సినిమా రాయటానికి ముందు ఒక అసిస్టెంటుతో పంపించి, అది అందినట్టు కాల్ చేయమని ఫోన్ నంబర్ ఇచ్చారు. పుస్తకం విలువ తెలిసిన మనిషికి జీవితమ విలువ ఖచ్చితంగా తెలుస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.

ఆయన వ్యక్తిత్వాన్ని నిర్వచించటం కోసం పంజా సినిమాలో ఒక డైలాగ్ కూడా రాయటానికి ప్రయత్నించాను అదే “సాయం చేసినవాడు కృతఙ్ఞత కోరుకొవటం ఎంత తప్పో, సాయం పొందినవాడు కృతఙ్ఞత చూపించకపోవటం కూడా అంతే తప్పు.”

ప్రజల కోసం, ప్రజల పక్కన నిలబడాలన్న ఆయన ఆశయం సంపూర్ణం గా నెరవేరాలని మనస్పూర్తి గా కోరుకుంటూ, ఆయన బాగుంటే కోట్ల మంది బాగుంటారని నమ్ముతూ, ఆయన పెదాల మీద చిరునవ్వు చిరంజీవిగా ఉండాలని కోరుకుంటున్నాను.

అబ్బూరి రవి, పవన్ కళ్యాణ్

ఆయన దగ్గర అబద్ధం ఆడక్కర్లేదు. చప్పట్లు కొట్టక్కర్లేదు. పొగడక్కర్లేదు మనం మనలా ఉండొచ్చు.

అంటూ పవన్ కళ్యాణ్ గారిమీదున్న ఆయన ప్రేమను పంచుకున్నారు.

ప్రముఖ మాటల రచయిత అబ్బూరి రవి గారు పవన్ కళ్యాణ్ గారి అన్నవరం, పంజా సినిమాలకు మాటలు అందించారు. గుడుంబా శంకర్ సినిమాకి కూడ ఒక రచయితగా పని చేసారు.

Comment

Select Your Language

Subscribe to Matalabu via Email

Enter your email address to subscribe to matalbu and receive notifications of new posts by email.

Social Contacts