బాలయ్య ఎంట్రీతో ఆచార్య కథలో ట్విస్టు
1 min read
బాలయ్య ఎంట్రీతో ఆచార్య కథలో ట్విస్టు: మెగాస్టార్ చిరంజీవి, సూపర్ హిట్ డైరెక్టర్ కొరటాల శివ గారి కాంబినేషన్లో భారీ అంచనాలతో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య.
అయితే ఆచార్య కథ నాదేనని ఆ కథని రిజిస్టార్ కూడా చేయించున్నాను దానికి సంబధించిన అన్నీ ఆధారాలు కూడా ఉన్నాయి అంటూ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ రాజేష్ మండూరి అనే వ్యక్తి ఆరోపనలు చేయటంతో సినీ వాకిళ్ళలో ఇది హాట్ టాపిక్ గా మారింది.
బాలయ్య ఎంట్రీతో ఆచార్య కథలో ట్విస్టు
ఆ కథకు “పెద్దాయన” అనే టీటిల్ పెట్టుకున్నాను. ఆ కథకు హీరోగా బాలక్రిష్ణ గారిని ఊహిచుకుంటూ రాసాను. బాలక్రిష్ణ గారి దగ్గరికి వెళ్ళేలోపు నా కథను కొట్టేసారు అని వాపోయారు.

ఈ కథ కొట్టేయాటానికి ముఖ్య కారకులు అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మరియు మైత్రీ మూవీ మేకర్స్ అంటూ చెప్పారు.
కొరటాల శివ వివరణ
ఇది ఇలా ఉండగా రీసెంట్ గా కొరటాల శివ గారు ఒక ఛానెల్ ఇంటర్వ్యూలో దీనిపై స్పందిస్తూ ఆరోపనలు చేసిన వ్యక్తికి కూడా వివరణ ఇచ్చారు.
సినిమా చూడకుండానే ఆ కథ మీదని మీకెలా తెలుస్తుంది. ఆ కథ మీది కాదు. ఇలానే ఆరోపనలు చేస్తే లీగల్ గా యాక్షన్ తీస్కోవల్సి వస్తుంది. దీనిపై మేం కోర్టుకు కూడ వెళ్తాం అప్పుడు ఏవి ఆరోపనలో ఏవి నిజాలో అందరికి తెలిపోద్ది అంటూ చెప్పారు.
కొరటాల కోర్టులో తేల్చుకుందాం అన్నప్పటినుంచి ఆరోపనలు చేసిన దర్శకుడు మళ్ళీ బయటకు రాలేదు అంటే కోర్టు లో నిజం తెలుస్తుందని ఆ కథపై అబద్దపు ఆరోపనలు చేసానని తెలిపోద్దని భయపడుతున్నార. లేదంటే ఇన్నర్ గా ఇంకేమైన జరిగిందో తెలీదు కానీ కొద్దిరోజులపాటు సినీలోగిళ్ళలో ఈ వార్త చేసిన దుమారం అంతా ఇంతా కాదనే చెప్పాలి.