మద్యం బాటిళ్ళతో సిక్స్ ప్యాక్
1 min read
మద్యం బాటిళ్ళతో సిక్స్ ప్యాక్
కృష్ణా జిల్లా తిరువూరు లో ఇద్దరు యువకులు అకస్మాత్తుగా లావుగా కనిపించటంతో గ్రామస్థులకు అనుమానం కలిగి ప్రశ్నించగా సిక్స్ ప్యాక్ అంటూ చెప్పటంతో అందరికీ అనుమానం కలిగింది.
ఇదే అనుమానం పోలీసులకు కూడా కలగడంతో ఆ సిక్స్ ప్యాక్ బండారం బట్టబయలైపోయింది.
ఆంధ్రప్రదేశ్ లో మద్య నిషేధ పరిమితులవల్ల తెలంగాణ, కర్ణాటక మరియు ఒడిశా నుంచి అక్రమంగా ఆంధ్రప్రదేశ్ కి మద్యం రవాణా చేస్తున్నారు. అలా రవాణా చేయడం లో ఒక్కొక్కరు ఒక్కోలా తమ వాటం చూపిస్తుంటే ఈసారి తెలంగాణ నుండి విజయవాడకు ఇద్దరు వ్యక్తులు తమ శరీరానికి ప్లాస్టర్ తో మద్యం బాటిల్స్ ని అతికించుకుని తీసుకెళ్తుండగా పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు. వారి నుంచి 101 మద్యం బాటిళ్ళు పోలీసులు స్వాధీనపరుచుకున్నారు.

అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఆధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ ఇలా ఎప్పటికప్పుడు అక్రమరవాణాదారులు వారి వారి తెలివితేటలు ప్రదర్శిస్తూ మద్యం తరలిస్తున్నారు. తాజాగా ఈ సిక్స్ ప్యాక్ ఉదంతం అందరినీ విస్తుపోయేలా చేసింది.