ప్లాస్మా దానం చేయలేనన్న డైరెక్టర్ SS రాజమౌళి
1 min read
ప్లాస్మా దానం చేయలేనన్న డైరెక్టర్ SS రాజమౌళి
దర్శకుడు SS రాజమౌళి గారి కుటుంబం లో అందరికీ కరోన సోకిందన్న విషయం తెలిసిందే ఆ తరువాత కుటుంబంలోని అందరికీ నెగేటివ్ రావడం జరిగింది.
కరోనాని జయించాక రాజమౌళి గారు సి.పి సజ్జనార్ గారు ఏర్పాటు చేసిన ప్లాస్మా డొనేషన్ ప్రచార కార్యక్రమంలో పాల్గొని అందరూ ప్లాస్మా డొనేట్ చేసి కరోనా బాధితులను కాపాడాలని పిలుపునిచ్చారు.
కీరవాణి గారు ఆయన కుమారుడు కాలభైరవ ప్లాస్మా డొనేట్ చేసినట్టు రాజమౌళి గారు ఆ ఫోటోలను ట్వీట్ చేసారు.
ఆయన కూడ ప్రతిరోధకాల(antibodies) పరీక్ష చేయించుకోగా తనకు Immunoglobulin G (IgG) level 8.62 ఉన్నట్లుగా కాకపొతే అవి 15కు మించి ఉంటేనే ప్లాస్మా డొనేట్ చేయటానికి అర్హులు అని చెప్పారు.
కరోన నుంచి కోలుకున్నవాళ్ళు వెంటనే ప్లాస్మా డొనేట్ చేయాలని ఎందుకంటే ప్రతిరోధకాలు(antibodies) ఎక్కువరోజులు వారి శరీరంలో ఉండవని చెప్పారు.

