సెప్టెంబర్ 22 ప్రాముఖ్యత గురించి చిరంజీవి మాటల్లో
1 min read
సెప్టెంబర్ 22 ప్రాముఖ్యత గురించి చిరంజీవి మాటల్లో
సెప్టెంబర్ 22 ప్రాముఖ్యత గురించి చిరంజీవి మాటల్లో
“నా జీవితంలో ఆగస్టు 22 కి ఎంత ప్రాముఖ్యత వుందో సెప్టెంబర్ 22 కి కూడా అంతే ప్రాముఖ్యత వుంది. ఆగష్టు 22 నేను ప్రాణం పోసుకున్న రోజైతే సెప్టెంబర్ 22 “ప్రాణం (ఖరీదు)” పోసుకున్న రోజు. నా తొలి చిత్రం విడుదలైన రోజు. నన్ను ఇంతగా ఆదరించి ఈ స్థాయికి చేర్చిన సినీ ప్రేక్షకులందరికీ, ముఖ్యంగా నా ప్రాణానికి ప్రాణమైన నా అభిమానులందరికీ ఈ సందర్భంగా మనస్పూర్తిగా కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.”
అంటూ చిరంజీవి గారు ట్విట్టర్ వేదికగా ఆయన అంతరంగాన్ని పంచుకున్నారు.
చిరంజీవి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇవ్వాళ్టితో సరిగ్గ 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు.
ఏ బ్యాగ్రవుండ్ లేకుండా వచ్చి తన స్టెప్పులతో, నటనతో మరియు డైలాగులతో తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

సునీల్, సత్యదేవ్, నవీన్ చంద్ర, నిఖిల్ ఇలా ఒకరేంటి ఈరోజు అగ్ర నటులు అనిపించుకుంటున్న చాలా మంది కేవలం చిరంజీవిని చూసే సినిమాల్లోకి వచ్చారు.