సీతారాముడు ఎక్కుపెట్టిన సాహిత్య విల్లు రామజోగయ్య శాస్త్రి..!!
1 min read
సినీ జగత్తుపైకి సీతారామ శాస్త్రి గారు ఎక్కుపెట్టిన సాహిత్య విల్లు రామజోగయ్య శాస్త్రి అంటే ఆయన అవును అని చిరునవ్వుతో మురిసిపోతాడు అంతేకానీ, అవకాశం నాది రాసింది నేను పేరు నాది అనే అహంకారం మచ్చుకైన ఆయనలో కనిపించదు పైగా నా పంట పండటానికి నీరు పట్టింది ఆయనేగా అనే స్వభావం కలవాడు.
తనదైన శైలిలో తెలుగు సినిమా పాటకు రంగులద్దుతూ ప్రేక్షకుల నాలుక మీద పాటలా వినిపిస్తున్నాడు..అప్పుడప్పుడు కనిపిస్తున్నాడు కూడాను.
గురువులు ఎవరికైన ఉంటారు. కానీ తమలో ఆ కళ పట్టుదల ఉంటేనే ఏదైన సాధ్యం అవుతుంది దానికి ప్రత్యక్ష సాక్ష్యం మన రామజోగయ్య శాత్రి గారు.
గుంటూరు మిర్చిల్లాంటి ఘాటైన పాటలు, కళ్యాణం కమనీయం అంటూ రమణీయమైన పాటలు. ఎలాంటి సందర్భానికి అలాంటి పాట అందించి ఔరా అనిపించే గీత రచయితల్లో ఈయన ముందువరసలోనే కుర్చీ వేసేసుకున్నారు.
అలాగే సోషల్ మీడియాలో ఆక్టివ్ గా ఉండే శాస్త్రి గారు ఈమధ్య వినాయక చవితి ముహూర్తాన రాంజో వ్రైట్స్ అనే యూట్యూబ్ చానెల్ కూడ ప్రారంభించారు.
మీ కలం సినీ సాహిత్యానికి కిరీటమై కీర్తికెక్కాలని ఆశిస్తూ జన్మదిన శుభాకాంక్షలు రామజోగయ్య శాస్త్రి గారు.