గుర్తుండిపోయే మొదటి బహుమానం ఇదేనంటున్న మెగాస్టార్..!!
1 min read
ప్రతీ సంవత్సరం ఘనంగ జరిగే చిరంజీవి గారి జన్మదిన వేడుకలు ఈసారి కరోన కారణంగా ఆ సందడంతా సోషల్ మీడీయాకు మాత్రమే పరిమితమైంది.
ఎవ్వరికీ తోచినట్టుగా వాళ్ళు విభిన్న రీతుల్లో సోషల్ మీడీయా వేదికగా అన్నయ్యకు శుభాకాంక్షలందిచారు.
అయితే అందుకు భిన్నంగా మోహన్ బాబు గారు మాత్రం నేరుగా చిరంజీవి గారి ఇంటికి ఒక బహుమతిని పంపి ఆయన్ని ఆశ్చర్యపరిచారు.

తన పుట్టినరోజుకి మోహన్ బాబు గారు ఇచ్చిన మొదటి బహుమానమిది, ఈ సర్ప్రయిజింగ్ గిఫ్ట్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ మిత్రుడు మోహన్ బాబుగారికి కృతఙ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియా లో ఆ గిఫ్ట్ తో పాటు ఫోటో దిగి దాన్ని పోస్ట్ చేసారు.