చేతబడితో పిట్టల్ని మాయం చేసిన ఊరు
1 min read
చేతబడితో పిట్టల్ని మాయం చేసిన ఊరు
చేతబడితో పిట్టల్ని మాయం చేసిన ఊరు
అప్పుడు నాకు 5 నుంచి 6 ఏళ్ళ వయసుంటుందేమో కోడి కూతకి లేచి ఆరుబయట గద్దె మీద కళ్ళ ఊసులు తీసుకుంటూంటే పిట్టలు చెట్టు కొమ్మల వాకిళ్ళు దాటి తిండి కోసం ఎక్కడికో ఎగిరిపోయేవి వాటిని చూస్తుంటే రెండు కళ్ళు చాలేవి కాదు. ఒకపక్క మా అమ్మ ఆవు పేడకళ్ళు తెచ్చి నీళ్ళలో కలిపి వాకిట్లో అలుకు చల్లుతుండేది. మా నాన్నేమో ఆవుకు గడ్డేసి పాలు పిండి ఇంటికి అరువుకు వచ్చినవాళ్ళకు పాలు పోసేది.
ఇంతలో మా లచ్చవ్వ. ఓ మర్చిపోయాను కదా అదే మేముండే గుడిసెకే ఒక గూడు కట్టుకుని ఇద్దరు పిళ్ళలతో కాపురం ఉంటుంది దానికి మా అమ్మే లచ్చవ్వా అని పేరు కూడా పెట్టింది.
మా లచ్చవ్వ కూడ లేచి ఆహారం కోసం బయల్దేరింది. దానికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువండోయ్ మేం ఎంత బాగా చూసుకుంటున్న అది తెచ్చే ఆహారం మాత్రమే దాని పిల్లలకి పెడ్తది.
మా గుడిసె ముందటనే ఓ యాప చెట్టూ ఉండేది. దాని కొమ్మలకు ఆనించి రెండు మూడు చిప్పలు పెట్టినం నేను మా నాన్న కలిసి రోజు నేను అవాటిని నీళ్ళతో నింపేటోన్ని. పాపం ఎక్కడెక్కడినుంచో చాలా పిట్టలు వచ్చి నీళ్ళు తాగిపోయేవి.
నాకు గడ్డ పెరుగంటే మస్తు ఇష్టం అందుకే మా నాన్నకు చెప్పి నాకోసం కొన్ని ఎక్కువ పాలు తీసి తోడేసి పెరుగు చేసేది. అప్పుడప్పుడు ఆ పిట్టలకు కూడ గడ్డపెరుగు పెట్టేది నేను కానీ ఎందుకు అవి తినలేదు కానీ మా పిల్లి మాత్రం అసల్ ఎం కనపడకుండా నాకేస్తూ తిన్నది.
అబ్బా ఇవన్నీ గుర్తొస్తే పట్నం లా ఉండబుడ్డే కాకపోయేది కొత్తగచ్చినరోజులల్ల కానీ ఏం చేస్తాం.
ఇన్నిరోజులకు తీరింది కదా అనీ మళ్ళీ వచ్చి చూస్నా.. నాకు అవేం కనిపించలేదు. మా గుడిసె తాటి కమ్మకు ఒంటరిగా మిగిలిపోయిన మా లచ్చవ్వ గూడు తప్ప.
అప్పుడే అర్థమైంది నాలెక్కనే ఊర్ల నుంచి పొట్టచేతపట్టుకుని చాలా మంది పట్నం పోయినారని. ఊరు అనాథైపోయినాదని. ఆ అనాథను చూసి పిట్టలు కన్నీళ్ళు పెట్టీ పెట్టి ఆ కొమ్మలకిందే రాలిపోయినాయని.
ఏదో చేతబడి చేసినట్టు పిట్టలు ప్రాణాలొదిలినయ్, పాలు గడ్డ పెరుగు పాకెట్లోకెక్కినయ్.
అరకట్ల రవితేజ
writer
baaga cheparu sir ee lockdown vallemo kaani pichukalani mainala chusthunamu
prodhunne levagane vinataniki vinasompuga vundedhi vatini aata patichatam vaati laage kusthu chala bagundedhi. miss those days