Wed. May 5th, 2021

రాష్ట్రం అంతటా వచ్చే 2 నెలలు ఉచితంగా రేషన్ సరుకులు

1 min read
రాష్ట్రం అంతటా వచ్చే 2 నెలలు ఉచితంగా రేషన్ సరుకులు

రాష్ట్రం అంతటా వచ్చే 2 నెలలు ఉచితంగా రేషన్ సరుకులు

రాష్ట్రం అంతటా వచ్చే 2 నెలలు ఉచితంగా రేషన్ సరుకులు

కరోనా వల్ల చాలా మంది నష్టపోయి రోడ్డునపడే పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడిప్పుడే కొంచం తగ్గుముఖం పట్టి అన్ని వ్యవస్థలు మొదలవుతున్న సమయంలో మళ్ళీ కరోనా ఉధృతి పెరగటంతో దేశం లో పరిస్థితులు దయనీయంగా మారాయి.

ఒకవైపు లాక్డౌన్ పెడితే పని లేక తినడానికి తిండిలేక ప్రజలు ప్రాణాలు కోల్పోతారనే భయం. మరోవైపు లాక్డౌన్ లేకపోతే కరోనా మహమ్మారి వల్ల ప్రాణాలు పోతాయనే భయం.

ప్రభుత్వాలు కూడా ఈ విషయంలో ఏమీ తేల్చుకోలేకపోతునాయి.

అయితే దేశ రాజధాని డిల్లీ లో కరోనా ఉధృతి దృష్ట్యా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఒక నిర్ణయానికొచ్చినట్టు ప్రకటించారు.

రేషన్ కార్డు ఉన్న ప్రతీ ఒక్క ఇంటికీ వచ్చే 2 నేలలు రేషన్ సరుకులు అన్నీ ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు.

అయితే ఇదీ 2 నెలల పాటు లాక్డౌన్ ఉంటుందనే అనుమానాలకు మాత్రం సంకేతం కాదు. లాక్డౌన్ ఉన్నా లే కున్నా వచ్చే 2 నేలలు ఉచితంగా సరుకులు అందిస్తామని తెలిపారు.

ప్రముఖులు ఈ నిర్ణయాన్ని అభినందిస్తూ తమతమ సోషల్ మీడియా అకౌంట్లలో కేజ్రీవాల్ కి అభినందలు తెలుపుతున్నారు.

Subscribe to Matalabu via Email

Enter your email address to subscribe to matalbu and receive notifications of new posts by email.

Social Contacts