Thu. May 6th, 2021

వాతావరణాన్ని బట్టి మారిపోతున్న ఆమె చేతి వేళ్ళ రంగు

1 min read
వాతావరణాన్ని బట్టి మారిపోతున్న ఆమె చేతి వేళ్ళ రంగు

వాతావరణాన్ని బట్టి మారిపోతున్న ఆమె చేతి వేళ్ళ రంగు

వాతావరణాన్ని బట్టి మారిపోతున్న ఆమె చేతి వేళ్ళ రంగు

ఆమె చేతి వేళ్ళు చలికాలం రాగానే ఉన్నట్టుండి రంగు మారి తెళ్ళగా అయిపోతున్నయి. ఆ సమయంలో ఆమె చేతి వెళ్ళకు రక్త ప్రసరణ ఉండదు. దాంతో వేళ్ళు తెల్లగా మారిపోతుంటాయి. ఇలాగే ఎక్కువసేపు ఉంటే తెళ్ళగ ఉన్న దగ్గర నీలి రంగు కూడా వస్తుందట.

వాతావరణాన్ని బట్టి మారిపోతున్న ఆమె చేతి వేళ్ళ రంగు

ఇలా 20 ఏళ్ళుగా ఆమె ఎప్పుడైన ఎక్కువ వొత్తిడికి లోనైనా, వాతావరణం బాగా చల్లగా అయిపోయినా ఆమె చేతి వేళ్ళ రంగు మారిపోయి తెల్లగా అయిపోతున్నాయి. ముఖ్యంగా జనవరిలో చలి కాలం కాబట్టీ ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుందట.

ఈ వ్యాధి పేరు రేనాడ్ సిండ్రోమ్ (raynaud’s syndrome). ఇదో అరుదైన సిండ్రోం.ఇందులో రక్త నాళాల్లోని చిన్న ధమనుల్లో రక్త సరఫరా క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటుంది. అందువల్ల చేతి వేళ్లు లేదా కాలి వేళ్లకు ఒక్కోసారి రక్త సరఫరా ఉండదు. దాంతో అవితెల్లగా కనిపిస్తాయి.

తిరిగి రక్త ప్రసరణ మొదలవగానే వేళ్ళలో పొడుస్తున్న నొప్పి కలుగుతుంది.

ఇలాంటి సమస్య ఉన్న వారు చేతి వేళ్లను కాస్త వెచ్చగా చేసుకుంటే తిరిగి రక్త ప్రసరణ సాధారణంగానే జరుగుతుందని డాక్టర్లు తెలిపారు.

Subscribe to Matalabu via Email

Enter your email address to subscribe to matalbu and receive notifications of new posts by email.

Social Contacts