Thu. May 6th, 2021

భగవద్గీత – ధృతరాష్ట్ర ఉవాచ

1 min read
భగవద్గీత – ధృతరాష్ట్ర ఉవాచ

భగవద్గీత – ధృతరాష్ట్ర ఉవాచ

భగవద్గీత ప్రథమాధ్యాయము

కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము

1.ధృతరాష్ట్ర ఉవాచ

ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ

ధృతరాష్ట్ర ఉవాచ : ధృతరాష్ట్రుడు పలికెను; ధర్మ-క్షేత్రే : ధర్మభూమి(తీర్థలి)నందు; కురు-క్షేత్రే:కురుక్షేత్రమను పేరు గల ప్రదేశమున; సమవేతాః : సమకూడిన; యుయుత్సవః : యుద్ధము చేయగోరువారై; మామకా? : నా పక్షమువారు(పుత్రులు); పాండవా? : పాండురాజు పుత్రులును;చ : మరియు; ఏవ : నిశ్చయముగా; కిమ్ : ఏమి; అకుర్వత : చేసిరి; సంజయ : ఓ సంజయా!

ధృతరాష్ట్రుడిట్లు పలికెను : ఓ సంజయా! నా పుత్రులును, పాండురాజు పుత్రులును యుద్ధము చేయగోరువారై ధర్మక్షేత్రమైన కురుక్షేత్రము నందు సమకూడిన పిమ్మట ఏమి చేసిరి?

భాష్యము : భగవద్గీత విస్తారముగా పరింపబడు ఆస్తిక విజ్ఞానశాస్త్రము. అది ‘గీతామాహాత్మ్యము’ నందు సంగ్రహింపబడినది (భగవత్ శాస్త్రము). ఎవరైనను
భగవద్గీతను కృష్ణభక్తుని సహాయమున పరిశీలనాత్మకముగా పరించి, ఎటువంటి స్వంత వ్యాఖ్యానాలు చేయకుండ అవగాహనము చేసుకొనుటకు యత్నింప వలెనని దానియందు తెలుపబడినది. అర్జునుడు గీతను భగవానుని నుండి ప్రత్యక్షముగా శ్రవణము చేసి అందులోని బోధనలను అవగాహన చేసుకొనెను. ఈ విధముగా ఎవరైనను దానిని స్పష్టముగ అవగాహన చేసుకొనగలరనుటకు భగవద్గీత యందే
గురుశిష్యపరంపరలో స్వకల్పిత వ్యాఖ్యానములు లేకుండా భగవద్గీతను అవగాహన చేసుకొనగలుగు అదృష్టివంతులైనచో వారు సమస్త వైదిక జ్ఞానమును మరియు ప్రపంచము నందలి ఇతర సమస్త శాస్త్రము లన్నింటిని అధిగమించిన వారగుదురు. ఇతర శాస్త్ర గ్రంథము కూడ భగవద్గీత యందు కలవని పాఠకుడు గుర్తింపగలడు. అదియే గీత యొక్కలన్నింటిలో గల విషయములే కాకుండ ఎక్కడా గోచరింపని విషయములు విశిష్ట ప్రామాణికత. దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానునిచే ప్రత్యక్షముగా చెప్పబడుట చేత ఈ భగవద్గీత సంపూర్ణ ఆస్తిక (భగవత్) విజ్ఞాన శాస్త్రముగా విరాజిల్లుచున్నది. ‘మహాభారతము’ నందు వర్ణింపబడిన ధృతరాష్ట్ర సంజయుల చర్చా విషయములు ఈ సర్వోత్కృష్ట తత్త్వశాస్త్రమునకు మూల సిద్ధాంతములగును.
అనాదియైన వేదకాలము నుండియు పవిత్ర తీర్థస్థలముగా ప్రసిద్ధి నొందిన కురుక్షేత్ర రణరంగమున ఈ తత్త్వశాస్త్రము ప్రభవించినట్లుగా తెలియుచున్నది. ఈ లోకము నందు భగవానుడు స్వయముగా అవతరించి యున్నప్పుడు ఆతనిచే
మానవుల మార్గదర్శనము కొరకై ఈ భగవద్గీత పలుకబడినది.
కురుక్షేత్ర రణరంగమున దేవాదిదేవుడు అర్జునుని పక్షమును వహించెను. కనుక ‘ధర్మక్షేత్రము’ (యజ్ఞములు నిర్వహింపబడిన ప్రదేశము) అను పదము ప్రాధాన్యతను సంతరించుకున్నది. కౌరవుల తండ్రియైన ధృతరాష్ట్రుడు తన పుత్రుల విజయావకాశములను గూర్చి గొప్ప సందిగ్ధ స్థితి యందుండెను. ఇట్టి సందిగ్ధ స్థితి యందు అతడు “వారేమి చేసిరి” అని కార్యదర్శియైన సంజయుని ప్రశ్నించెను.
అంతేకాకుండ తన పుత్రులు మరియు తన సోదరుడైన పాండురాజు పుత్రులును యుద్ధము చేయవలెనను దృఢనిశ్చయముతో కురుక్షేత్రమున సమకూడి యుండిరని
అతడెరుగును. అయినను అతనిని ఆ విధముగా ప్రశ్నించుటలో ఒక విశేషము గలదు.
జ్ఞాతులైన సోదరుల మధ్య అతడు సంధిని కోరుకొనలేదు. అంతేకాకుండ, అతడు రణరంగమున తన పుత్రుల విధి ఎట్లుండునో నిశ్చయముగా తెలియగోరెను. కురుక్షేత్రము నందు యుద్ధము ఏర్పాటు చేయబడుటచే యుద్ధపరిణామముపై ఆ పవిత్ర స్థలప్రభావమును గూర్చి అతడు ఎంతగానో భయపడుచుండెను. వేదములలో స్వర్గలోకవాసులకు కూడ పూజనీయస్థానముగా తెలుపబడినట్టి
ఆ క్షేత్రము వారిపట్ల అనుకూల ప్రభావమును చూపునని అతడు పూర్తిగా ఎరుగును. సంజయుడు వ్యాసదేవుని శిష్యుడు. వ్యాసుని కృపచే అతడు ధృతరాష్ట్రుని మందిరమున నిలిచి యున్నప్పటికినీ కురుక్షేత్ర రణరంగమును దర్శింపగలిగెను.
కనుక ధృతరాష్ట్రుడు యుద్ధరంగము నందలి పరిస్థితిని గూర్చి సంజయుని అడిగెను.

పాండవులు మరియు ధృతరాష్ట్రుని పుత్రులును ఒకే కుటుంబమునకు చెందిన వారైనను ఇక్కడ ధృతరాష్ట్రుని మనోభావము స్పష్టముగా విశదపరచ ఉద్దేశపూర్వకముగా తన పుత్రులను మాత్రమే కురువంశీయులుగా పేర్కొని పాండు సంతానమును కుటుంబ వారసత్వము నుండి వేరుచేసెను. ఈ విధముగా సోదరుని పుత్రులైన పాండవులతో ధృతరాష్ట్రునికి గల సంబంధ విషయమున అతని భిన్న వైఖరిని ఎవరైనను అవగతము చేసుకొనవచ్చును. పంట పొలముల నుండి అనవసరములైన కలుపు మొక్కలు తీసివేయబడునట్లు
ధర్మపితయైన శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా నిలిచియుండుట చేత ధర్మక్షేత్రమగు కురుక్షేత్రము నుండి కలుపు మొక్కల వంటి దుర్యోధనాది ధృతరాష్ట్రుని పుత్రులు
నిర్మూలింప బడుదురనియు, యుష్ఠిరుని అధ్యక్షతన గల ధార్మికులైన పాండవులు భగవానుని చేత ప్రతిష్టింప బడుదురనియు, ఆది నుండియే ఈ విధముగా
ఆశింపబడినది. చారిత్రక మరియు వైదిక ప్రాముఖ్యమే కాకుండ ‘ధర్మక్షేత్రే’ మరియు ‘కురుక్షేత్రే’ అను పదములకు గల విశేషార్థమిదియే.

Subscribe to Matalabu via Email

Enter your email address to subscribe to matalbu and receive notifications of new posts by email.

Social Contacts