Thu. May 6th, 2021

ప్రస్థానం డైరెక్టర్ బాహుబలిలో రాసిన డైలాగు ఎంత ఫేమస్ అయిందో తెలుసా

1 min read
ప్రస్థానం డైరెక్టర్ బాహుబలిలో రాసిన డైలాగు ఎంత ఫేమస్ అయిందో తెలుసా

ప్రస్థానం డైరెక్టర్ బాహుబలిలో రాసిన డైలాగు ఎంత ఫేమస్ అయిందో తెలుసా

ప్రస్థానం డైరెక్టర్ బాహుబలిలో రాసిన డైలాగు ఎంత ఫేమస్ అయిందో తెలుసా

వెన్నెల సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన దేవకట్ట ఆ తరువాత ప్రస్థానం సినిమాతో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటు ఒక ప్రత్యేక గౌరవాన్ని దక్కించుకున్నారు.

దేవకట్ట నుంచి సినిమా వస్తుండంటే ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు పెరిగిపోయేంతలా గుర్తిపంపు తెచ్చుకున్నారు, నాగ చైతన్యతో తీసిన మూడవ చిత్రం ఆటో నగర్ సూర్య అంచనాలను అందుకోలేకపోయింది. కానీ దేవకట్ట మీది గౌరవాన్ని అభిమానాన్ని మాత్రం ఏమాత్రం తగ్గించలేకపోయింది.

త్వరలోనే దేవకట్ట సాయిధరం తేజ్ హీరో గా “రిపబ్లిక్” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.  

ప్రస్థానం సినిమా అంతా ఒక ఎత్తైతే అందులో ఉన్న డైలాగ్స్ ఇంకొక ఎత్తు. పోలీస్ స్టోరీ తర్వాత సాయి కుమార్ గారికి అంత బాగ గుర్తింపు తెచ్చిన డైలాగ్స్ కూడా అవే అనటంలో అతిశయోక్తి లేదు.

అలాంటి మాటలు రాసిన దేవకట్ట బాహుబలిలో కూడా మాటలు రాసారు.

బాహుబలి చిత్రీకరణ సమయంలో రాజమౌళి గారికి కొన్ని డైలాగ్స్ అవసరమొచ్చాయి. అవి దేవకట్ట అయితేనే రాయగలరు అని నమ్మి ఆయనకు సన్నివేషాన్ని వివరించి ఆ మాటలు రాయించుకున్నారట.

ప్రస్థానం డైరెక్టర్ బాహుబలిలో రాసిన డైలాగు ఎంత ఫేమస్ అయిందో తెలుసా
ప్రస్థానం డైరెక్టర్ బాహుబలిలో రాసిన డైలాగు ఎంత ఫేమస్ అయిందో తెలుసా

బాహుబలి మొదటి భాగంలో, కాలేకేయులకు భయపడి సైనికులు చెల్లాచెదురైపోతుంటే అప్పుడు ప్రభాస్ వాళ్ళలో ధైర్యం నింపడానికి చెప్పే మాటలు గుర్తున్నాయి కదా.. అదే.,

ఏది మరణం?
మన గుండె ధైర్యం కన్నా శత్రువు బలగం పెద్దది అనుకోవడం మరణం
రణరంగంలో చావుకన్నా పిరికితనంతో బ్రతికి ఉండటం మరణం
మన తల్లిని అవమానించిన నీచుడు కళ్ళెదురుగా నిలబడి నవ్వుతూ దిగ చూస్తుంటే వాడి తల నరికి అమ్మ పాదాల కింద పాతకుండా వెన్ను చూపి పారిపోవడం మరణం
ఆ మరణాన్ని జయించడానికి నేను వెళ్తున్నాను
నా తల్లిని నా నేలని ఏ నీచుడు నికృష్టుడు ముట్టుకోలేడని రొమ్ముచీల్చి, నెత్తురు తాగి చెప్పడానికి వెళ్తున్నాను
నాతో వచ్చేదెవరు..?
నాతో చచ్చేదెవరు..?
ఆ మరణాన్ని దాటి నాతో బ్రతికేదెవరు..?

జై మాహిస్మతీ..!!

Subscribe to Matalabu via Email

Enter your email address to subscribe to matalbu and receive notifications of new posts by email.

Social Contacts