తెలంగాణ రాజకీయ రణరంగంలో మరో సవాల్ రెడ్డి రేవంత్ రెడ్డి
PCC అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి నియామకంతో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
అంగ, అర్థ బలం, ప్రింటు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా పైన పట్టు, KCR వాక్చాతుర్యం, KTR, హరీష్ రావు, కవిత వంటి యువ నాయకుల నాయకత్వంలో అధికార TRS పార్టీ తెలంగాణ రాజకీయాలలో ప్రముఖ స్థానంలో ఉంది.
రైతు బంధు, వృద్ధాప్య పెన్షన్, కాళేశ్వరం ప్రాజెక్టుల జలాలు వంటి అంశాలతో పాటు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ల MIM పార్టీ తో లోపాయికారి ఒప్పందముతో మైనారిటీ ఓటు బ్యాంకు పై పట్టు వంటి అంశాలతో TRS ఉత్సాహంతో ఉంది.
ఇక బండి సంజయ్, ఈటెల రాజేందర్, లక్ష్మణ్, ధర్మపురి అరవింద్ వంటి BJP నాయకులు మరియు కిషన్ రెడ్డి వంటి సమాజిక సమీకరణాలు, కేంద్రంలో అధికారం, మోడీ చరిష్మా, అమిత్ షా వ్యూహాలు, సంఘ్ పరివార్ అనుబంధ సంస్థల అండదండలు సోషల్ మీడియా ను అత్యుత్తమంగా వాడుతూ ఇటీవల దుబ్బాక, GHMC ఎలక్షన్స్ ఫలితాలు హుజురాబాద్ లో చేరికలతో BJP తెలంగాణ రాజకీయాల్లో KCR ను TRS ను సవాల్ చేస్తోంది.
కేంద్రంలో అధికారం లేకపోవడం, ఆఈఛ్ఛ్ అధ్యక్ష పదవిలో రాహుల్/సోనియా గాంధీ ఎవరు నిర్వహిస్తున్నారో స్పష్టత లేని స్థితి.
కోమటి రెడ్డి, ఉత్తం కుమార్, వ్.హనుమంత రావు వంటి సీనియర్ల అసంతృప్తి, రెడ్డి సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకోవడానికి BJP/YS షర్మిల వేస్తున్న ఎత్తుల, వ్యూహాల వంటి అనేకానేక సవాళ్ళ మధ్యన PCC అధ్యక్ష పీఠాన్ని అలంకరించాడు రేవంత్ రెడ్డి.
దూకుడుగా ఉండడము, వాక్చాతుర్యము ఉండడం వివిధ రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాల్లో అవగాహన వంటి సానుకూల అంశాలు రేవంత్ రెడ్డి పక్షాణ ఉన్నాయి.
గతంలో తెలంగాణలో సమసమాజం, కమ్యూనిజం అనేది ఒక రాజకీయ అంశంగా ఉండేది. దానిపైన ఒక ఓటు బ్యాంకు ఉండేది. ఆ ఓటు బ్యాంకు కోసం కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకొనేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దాని స్థానంలో చైనా, పాకిస్థాన్ ల దుందుడుకు చర్యల వలన జాతీయ రక్షణ, భైన్సా లో హిందువులపై దాడులు, MIM అక్బరుద్దీన్ ఓవైసీ వంటి వారి నీచమైన మాటలతో హిందుత్వం అనేది ఒక బలమైన అంశంగా మారింది.
ఈ పరిస్థితులలో కాంగ్రెస్ హిందువులకు, MIM తో KCR పొత్తు వలన ముస్లీం ఓట్లకు దూరమై ఎటు పాలుపోని పరిస్థితులలో ఉంది.
ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు, RTC కార్మీకుల్లో, ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు, అధ్యాపకుల్లో,నిరుద్యోగుల్లో KCR పైన వ్యతిరేఖత ఉందని అది తమకు ఉపయోగపడుతుందని రేవంత్/బండి సంజయ్ లు ఇద్దరు భావిస్తున్నారు. నిజంగా ఆయా వర్గాల్లో KCR పైన ఎంత వ్యతిరెఖత ఉంది అది కాంగ్రెస్, BJP లలో ఎవరికి ఉపయోగపడుతుందో చెప్పలేము.
క్రిస్టియన్ మైనారిటీల ఓట్ల పైన ఆశలు పెట్టుకున్న సోనియా, ప్రియాంక, రాహుల్ గాంధీల కుటుంబ నేపథ్యం మరియు సేవ, విద్యా ముసుగులో మతమార్పిడీలు, భారత సంస్కృతి పైన దాడి చేస్తున్న విదేశీ మిషనరీల పైన నైతిక వైఖరి ఆధారంగా కాగ్రెస్ కు క్రిస్టియన్ మైనారిటీ ఓటు పైన ఆశ ఉండేది. ఇక ఇప్పుడు క్రైస్తవ మత ప్రచారకుడు బ్రదర్ అనిల్ గారి శ్రీమతి షర్మిల స్వయంగా తెలంగాణ రాజకీయాల్లో అడుగు పెట్టడంతో ఆ ఆశ కూడా అడియాస అయింది.
ఇక KCR/BJP మధ్య లోపాయికారి ఒప్పందం ఉంది అని ప్రచారం చేయడం ఒకటే కాంగ్రెస్ కి ప్రధాన అంశంగా ఉంది.
తెలంగాన రాజకీయాల్లో CPM, CPI, TDP పూర్తిగా అంతరిచిపోయాయి. ఇక తదుపరి వంతు కాంగ్రెస్ ది అని అందరూ భావిస్తున్న తరుణంలో రేవంత్ వంటి ఒక దూకుడు మాటకారి నాయకుడు అద్భుతమేమైనా చేయగలడా? కాంగ్రెస్ పునరుజ్జీవానికి కాయకల్ప చికిత్స చేస్తాడ? లేక రాహుల్ గాంధీ అభీష్టానికి అనుగుణంగా స్టెరాయిడ్స్ వాడతాడా? శస్త్ర చికిత్స చేస్తారా? వేచి చూడాలి.
Nitya Kalpan