మోడీ పాపులారిటీపై పెట్రోల్ డీజిల్ ప్రభావము
పెట్రోల్ మరియు డీజిల్ రేట్లు సెంచరీ కొట్టాయి.
అయినా ఈ దేశంలోని రాజకీయ నాయకుల పాపులారిటీలో మోడీ ఇంకా అగ్రస్థానంలోనే ఉన్నారు. అతని తరువాత పాపులారిటీలో కూడా యోగి ఆదిత్యనాథ్ లాంటి బీజేపీ నాయకులే ఉన్నారు.
కానీ ప్రతిపక్ష నాయకులు కనపడటము లేదు. ఎందుకు??
దేశ ప్రజలు మిగతా విషయాలు కూడా గమనిస్తున్నారు. ముఖ్యంగా.,
- స్వాతంత్రం వచ్చినప్పటినుండి ఇప్పటి వరకు నిర్లక్ష్యం చేయబడ్డ రక్షణ శాఖకు,
- రఫెల్ లాంటి అధునాతన యుద్ధ విమానాలు.
- సైనికులకు, రక్షణ దళాలకు మెరుగైన వసతులు జీతబత్యాలు.
- సరిహద్దుల దగ్గర రహదారులు, వంతెనలు, బంకర్లు ఇతర మౌళిక వసతుల కల్పన.
- CAA, NRC విధానాలు అమలు చేయడం ద్వారా బంగ్లాదేశ్, బర్మా నుండి అక్రమ వలస దారులను నిరోధించడం.
- జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని పూర్తిగా భారత్ లో కలిపేందుకు వీలుగా ఆర్టికల్ 370 ని రద్దు చేయడం.
- కోవిడ్-19 కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ దెబ్బతిని ప్రభుత్వ ఆదాయం తగ్గడము.
- వైద్య రంగానికి ఉచిత టీకాలు, ఆక్సిజన్ ప్లాంటులు ఇతరత్రా సదుపాయాల కల్పనకు ధనం అవసరముండడము.
- ప్రతిపక్షాలు పెట్రోల్, డీజిల్ రేట్ల పెంపు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రత్యామ్నాయ ఆర్థిక వనరులను చూపెట్టడము లేదు.
- అరవింద్ కేజ్రీవాల్ లాంటి IIT గ్రాడ్యువేట్స్ కూడా కులరాజకీయాలు, మైనారిటీ ఓటు బ్యాంకు కోసం తీవ్రవాదం పైన మెతక వైఖరి తీసుకోవడం.
బీజేపీ/మోడీ లలో లోపాలు లేవని కాదు. కానీ వాటిని ఉపయోగించుకోవాలంటే కాంగ్రెస్ ,ఇతర ప్రతిపక్షాలు
- మీడియాను నమ్ముకోవడం,
- కులరాజకీయాలు,
- మైనారిటీ ఓటు బ్యాంకు కోసం తీవ్రవాదం పైన మెతక వైఖరి,
- వారసత్వ రాజకీయాలు అనే అవలక్షణాలను విసర్జించి
ఘనమైన ప్రాచీన భారత సంస్కృతి, సాంప్రదాయాలు వాటిలోని శాస్త్రీయతను పునాదిగా చేసుకుని విశ్వ గురువుగా వర్దిల్లాలనుకుంటున్న యువతరం ఆకాంక్షలను గుర్తించే దిశలో మేల్కొంటే మనుగడలో ఉంటాయి. లేదంటే అంతరిస్తాయి.
Nitya Kalpan