తక్షణ రోగం
ఏంటి! కరోనా మహమ్మారి పోకముందే , మళ్లీ కొత్త రోగం వచ్చిందా? అని ఆలోచిస్తున్నారా ? ఎస్ .అది నిజమే.
ఇప్పుడు చిన్న ,పెద్ద తేడా లేకుండా, పల్లె పట్నం అని ఆగకుండా, ప్రతి ఒక్కరిని పట్టిపీడిస్తున ఆ రోగం పేరు తక్షణ రోగం.
తమ పని తక్షణమే అవ్వాలి. ఎవరికి క్షణం కూడా ఓపిక లేదు. చిన్నపిల్లలు అడిగింది వెంటనే ఇవ్వాలని మారం.
పెద్దవాళ్లు కావాలనుకుంది వెంటనే దొరకాలని ప్రయత్నం.
ఆఫీస్ నుండి 7:00 కి ఫోన్ తక్షణమే రిపోర్టు పంపమని, మరుసటి రోజు వరకు ఆగలేరా?? హాస్టల్ నుండి పిల్లల ఫోన్ తక్షణమే డబ్బు పంపమని, నాలుగు రోజులు ఆగలేరా?? కిందినుండి ఇంటి ఓనర్ కేక తక్షణమే ఇంటి రెంట్ కట్టమని ?? ఇంట్లోకి రాగానే అందరి గోల తక్షణమే కేబుల్ టీవీ రీఛార్జ్ చేయమని, ఇలా ప్రతి ఒక్కరు తక్షణమే తమ పని కావాలని కోరుకుంటున్నారు మరి ఈ తక్షణ రోగం ఎంత ముదిరి పోయింది అంటే, సంవత్సరంలో పెట్టాల్సిన తద్దినం మూడు నెలల్లో పెట్టడం. సంవత్సర కాలంలో కట్టాల్సిన బిల్డింగ్ ఆరు నెలల్లో కట్టడం.
ఆరు నెలల్లో పెట్టాల్సిన పరీక్షలు ప్రతిరోజు పెట్టడం. నాలుగు నెలల్లో రావలసిన పంట రెండున్నర నెలల్లో లో రావాలని ఆశ పడడం.
వారంలో తగ్గే జలుబు, దగ్గు ఒక్కరోజులో తగ్గాలనే హైరానా పడటం.
నాలుగురోజుల్లో పండగలసినపండు, రెండు రోజుల్లో పండాలని కోరుకోవడం.
నాలుగు గంటల్లో వ వండాల్సిన బిర్యాని తక్షణమే తినాలని ఆర్డర్ చేయడం .
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉదాహరణలు.
చివరకు ప్రేమ కోసం వేచి ఉండే సమయం కూడా లేదు.
ప్రేమించిన వాళ్ళు వెంటనే ఓకే చెప్పాలి.
ప్రేమకోసం పడే కష్టాల్లో ఉన్న సుఖాన్ని కూడా తక్షణమే పొందాలి.
కానీ నీ ఈ తక్షణ రోగం తగ్గేదెలా??
ఒక్కసారి ఆగి ఆలోచించద్దాం. తక్షణ రోగాన్ని విచక్షణతో గెలుద్దాం.
సహనం లో ఉన్న ఆనందాన్ని పొందుదాం. చిన్నప్పుడు విన్న తాబేలు-కుందేలు కథ ద్వారా మన పెద్దలు మనకు చెప్పిన నీతిని గ్రహించుదాము.
Sandhya Gopaldas