ట్రై సిటీని (వరంగల్) మెట్రో సిటీ గా మార్చడం రాష్ట్ర ప్రగతికి అత్యవసరం
రాష్ట్ర రాజధాని హైదరాబాద్ అభివృద్ధి పథంలో అంతర్జాతీయంగా ఎంతో ముందుంది.
అయితే కేవలం అభివృద్ధి రాజధానికి మాత్రమే పరిమితమవుతే రాష్ట్ర అభివృద్ధికుంటు పడుతోంది.
మిగతా రాష్ట్రాలలో కనీసం నాలుగైదు పెద్ద జిల్లాలు రాష్ట్ర రాజధానికి దీటుగా అభివృద్ధి, మోడ్రన్ సిటీలుగా అవతరించి, అభివృద్ధి పథంలో నడుస్తూ, పర్యాటకులను ఆకర్షిస్తూ, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తునాయి.
మన తెలంగాణలో హైదరాబాద్ సిటీ కి పోటీ పడడానికి చేరువలో మరే నగరం లేదనే చెప్పొచ్చు .
తెలంగాణ లో రాజధానితోపాటు అభివృద్ధి చేయాల్సిన నగరాల అవసరం అత్యవసరమైనది.
• కాకతీయుల రాజధానిగా చరిత్రపుటల్లో స్థానం సంపాదించుకున్న వరంగల్ ఓరుగల్లు గా పోరుగల్లు గా, ఘనమైన చరిత్ర గలది.
• 500 సంవత్సరాల పైబడిన కాకతీయుల వైభవం.
• యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం.
• నేటి టెక్నాలజీకి పాఠాలు చెప్పే వేయి స్తంభాల దేవాలయం.
• ఆసియా ఖండంలో పెద్ద జాతర గా గుర్తింపు తెచ్చుకున్న సమ్మక్క సారక్క జాతర.
• వందల సంవత్సరాలు పూర్వమే ఏర్పాటైన రాజ రాజ నరేంద్ర గ్రంథాలయం.
• వంద సంవత్సరాలకు చేరువలో కాకతీయ యూనివర్సిటీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ .
• నైపుణ్యాలను పెంచడంలో తనదైన గుర్తింపు సాధించిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) మరియు కాకతీయ మెడికల్ కాలేజ్.
• ఎన్నో వందల కుటుంబాలు నీ పోషించిన ఆజంజాహి మిల్లు కమలాపూర్ పేపర్ ఫ్యాక్టరీ.
• దేశంలో ముఖ్యమైన రైల్వే జంక్షన్ గా గుర్తింపు పొందిన కాజీపేట జంక్షన్, మూడో రైల్వే లైన్ సాంక్షన్ తో ముందుకు పరిగెడుతుంది
• ఎన్నో ఏళ్లుగా రాష్ట్రానికి దేశానికి సేవలందిస్తున్న అదాలత్ మరియు సెంట్రల్ జైలు.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ప్రత్యేకతలు కలిగిన వరంగల్ జిల్లా ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి దూరంగా ఉంటుంది.
వరంగల్ ప్రజా ప్రతినిధులు అన్నా, జిల్లా మెజిస్ట్రేట్ అన్నా, పోలీసులు అన్నా, నక్సలైట్ల అన్న, కళాకారులు అన్న ,కవులు అన్న దేశంలో లో ఒక ప్రత్యేక మైన గౌరవం.
ఇన్ని ప్రత్యేకతలు ఉన్న
జిల్లాను టెక్నాలజీ హబ్ గా, టెక్స్ టైల్ హబ్ గా, ఎడ్యుకేషనల్ హబ్ గా, మెడికల్ హబ్ గా, అభివృద్ధి పదంలో నడిపిస్తే, ఇంజనీరింగ్, మెడికల్ మరియు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు వరంగా మారి,
హైదరాబాద్ నగరానికి సమానంగా రాష్ట్రానికి వన్నె తెస్తుంది.
ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నా ఎయిర్ పోర్ట్, టెక్నాలజీ పార్క్, మెట్రో రైల్, ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు ఏర్పాటుపై దృష్టి పెట్టినట్లయితే,వరంగల్ మరింత అందమైన మెట్రో నగరంగా చరిత్ర సృష్టిస్తుంది.
స్వతహాగా పర్యాటకులను ఆకర్షించే వరంగల్ లో పర్యాటక రంగంలో మరింత దూసుకెళ్తుంది.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా ప్రతినిధులు రాజకీయాలకతీతంగా, పార్టీలకతీతంగా, వరంగల్ నగర ఉజ్వల భవిష్యత్తు పై దృష్టిపెట్టి, మరో మెట్రో నగర నిర్మాణానికి నాంది పలకాలి.
దేశానికి ప్రధానమంత్రిని ని అందించిన జిల్లా, ఈరోజు అభివృద్ధి కోసం ఎదురుచూస్తుంది.
వరంగల్ ప్రజా ప్రతినిధులారా, పట్టణ ప్రణాళిక లో భాగస్వాములైన అధికారులారా, వరంగల్ వాస్తవ్యులారా, అందరం ఏకమవుదాం, ట్రై సిటీని మెట్రో సిటీ గా మారుద్దాం.
విద్య శ్రీ కందుల